మనవరాలిని అమ్ముకున్న కసాయి అమ్మమ్మ
చేసిన అప్పులు తీర్చటం కోసం సొంత మానవరాలినే అమ్ముకుంది ఓ అమ్మమ్మ. చిన్నారి తండ్రి పోలీసులకు పిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పాపను ICPS కు అప్పగించిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామానికి చెందిన మొతే పద్మ, రమేష్ల కూతురు, అప్పులు కట్టుకునేయందుకు అమ్మమ్మ కనకమ్మ పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి నాలుగురోజుల క్రితం రూ :1,10,000 ల !! కు అమ్మేసింది. రమేష్ కుటంబం హైదరాబాద్ లో ఉంటున్నారు కాగా నెలరోజులక్రితం పద్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక వారం రోజులక్రితం పద్మ భర్తతో గొడవపడి తల్లి కనకమ్మ ఇంటికి బిడ్డతో సహా వచ్చింది. అయితే కూతురు మనసు మార్చేసి కాగితాలపై సంతకాలు చేయించి నెలరోజుల పసి బిడ్డను అమ్మేసింది అమ్మమ్మ.
పద్మ భర్త భార్యకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు, అయితె బిడ్డను అమ్ముకున్నారని తెలిసి అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కనకమ్మ మరియు ఆమేకు సహకరించినవారిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
అప్పు తీర్చడం కోసం మనవరాలిని అమ్ముకున్న అమ్మమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి