We are providing only trending telugu latest viral news with videos.

Breaking

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రసాయన ఎరువుల వాడకంతో భూమి తన సహజత్వాన్ని కోల్పోతోంది ll Processing of Organic Dry Anjeer| Basava Nagenderrao..

రసాయన ఎరువుల వాడకంతో భూమి తన సహజత్వాన్ని కోల్పోతోంది

రసాయన ఎరువుల వాడకంతో పుడమితల్లి సహజత్వాన్ని కోల్పోతోంది. వ్యవసాయంలో వినియోగిస్తున్న పురుగుమందులు ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఫలితంగా రైతులకు పెట్టుబడి భారం పెరగడంతోపాటు ఆ పంటలను ఆహారంగా తీసుకుంటున్న మనం అనారోగ్యాలపాలవుతున్నాం. సేంద్రియ సేద్యమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం. అందుకే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెదతానుపాడు గ్రామానికి చెందిన బసవ నాగేందరరావు ప్రకృతి విధానాన్ని ఎంచుకున్నారు. తనకున్న 15 ఎకరాల్లో మూడేళ్లుగా సేంద్రియ పద్ధతిలో డయానారకం అంజీర మొక్కలను సాగు చేస్తున్నారు. అంజీర పళ్లను విక్రయించడానికి బదులు డ్రై అంజీరగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో డ్రై అంజీరలో లాభాలు ఆర్జిస్తున్నారు. అంజీర తోటలో సాగుఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ... డ్రై అంజీరగా మార్చే క్రమంలో కూలీలకు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోందని నాగేందరరావు చెబుతున్నారు. అన్ని ఖర్చులుపోనూ ఎకరానికి లక్ష రూపాయలవరకు ఆదాయం వస్తోందని వివరిస్తున్నారు.

రసాయన ఎరువుల వాడకంతో భూమి తన సహజత్వాన్ని కోల్పోతోంది 
 Processing of Organic Dry Anjeer| Basava Nagenderrao

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి